Vivo V50e: ఫోటోగ్రఫీకి బెస్ట్ ఆప్షన్.. వివో కొత్త మోడల్ యొక్క కొత్త స్టైలిష్ డిజైన్.. 10 month ago
వివో సంస్థ తమ వి సిరీస్‌లో భాగంగా కొత్త స్మార్ట్‌ఫోన్ "Vivo V50e" ను భారత మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది. ఈ ఫోన్ ప్రత్యేకంగా పోర్ట్రెయిట్ ఫొటోగ్రఫీకి ప్రాధాన్యతనిస్తూ.. అధునాతన కెమెరా ఫీచర్లతో రూపొందించబడింది. ఇది మధ్య-శ్రేణి విభాగంలో ఒక ఆకర్షణీయమైన మొబైల్. ఇది ఆకర్షణీయమైన డిజైన్‌తో వస్తుంది. ముఖ్యంగా ఫోటోగ్రఫీ మరియు వీడియో రికార్డింగ్ పై ఆసక్తి ఉన్నవారిని దృష్టిలో ఉంచుకొని దీనిని రూపొందించారు. ఈ ఫోన్ గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం రండి.!
Vivo V50e 5G ఫీచర్లు:
డిస్‌ప్లే: 6.77-అంగుళాల AMOLED కర్వ్డ్ డిస్‌ప్లే
రిఫ్రెష్ రేట్: 120 Hz
పీక్ బ్రైట్‌నెస్: 1800 nits
ప్రాసెసర్: MediaTek Dimensity 7300
ఆపరేటింగ్ సిస్టమ్: Android v15, Funtouch OS
బ్యాటరీ: 5600 mAh
ఛార్జింగ్: 90W ఫాస్ట్ ఛార్జింగ్
బరువు: 186 గ్రాములు
కెమెరా ఫీచర్లు:
బ్యాక్ కెమెరా:
- 50 MP మెయిన్ కెమెరా
- 8 MP అల్ట్రా-వైడ్ యాంగిల్
ఫ్రంట్ కెమెరా: 50 MP సెల్ఫీ కెమె
వేరియంట్స్:
8 GB RAM + 128 GB స్టోరేజ్
8 GB RAM + 256 GB స్టోరేజ్
కనెక్టివిటీ ఫీచర్లు:
- 5G, 4G డ్యూయల్ సిమ్
- Wi-Fi 6
- బ్లూటూత్ 5.4
- GPS, USB OTG
- USB Type-C
కలర్ ఆప్షన్స్:
- పెర్ల్ వైట్
- సాఫైర్ బ్లూ
ఫోన్ ధర:
8 GB RAM + 128 GB స్టోరేజ్-- రూ.28,999
8 GB RAM + 256 GB స్టోరేజ్-- రూ.30,999
ప్లస్ పాయింట్స్:
- వేగవంతమైన 90W ఫాస్ట్ ఛార్జింగ్
- 50-MP Eye-AF గ్రూప్ సెల్ఫీ కెమెరా
- AMOLED కర్వ్డ్ డిస్‌ప్లే
- IP68/IP69 వాటర్ మరియు డస్ట్ రెసిస్టెన్స్
మైనస్ పాయింట్స్:
- ఎక్కువ వేరియంట్లు లెవ్వు
- NFC లేదు
ఈ Vivo V50e మొబైల్ మధ్య శ్రేణి ధరలో..మంచి పోటిదారి ఫోన్ గా నిలవనుంది. ప్రస్తుతం ఈ ఫోన్ లాంచ్ అయినప్పటికీ..వివో సంస్థ దీనిని ఏప్రిల్ 22న మార్కెట్లోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఫోటోలు, వీడియోలు బాగా తీయాలనుకునేవారికి ఇది సరైన ఎంపిక. వేగవంతమైన ఛార్జింగ్.. అందమైన డిజైన్ దీని ప్రత్యేకతలు. ఈ కాలానికి తగ్గ అన్ని ఫీచర్లను ఇది అందిస్తుంది. ఈ ఫోన్ మొదటగా ఆన్‌లైన్ లో అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ లో దీని ప్రీ-ఆర్డర్స్ జరుగుతున్నాయి.
ఇది చదవండి: 6.88 HD+ LCD డిస్‌ప్లే, భారీ బ్యాటరీ వంటి బ్లాక్‌బస్టర్ ఫీచర్లతో పోకో C71.. కేవలం ₹6,499కే.!